విశ్వంభర బ్లాక్ బస్టర్ హిట్….

విశ్వంభర బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతోంద

మనకు తెలుసు కదా మెగాస్టార్ చిరంజీవి , బింబిసార సినిమా తో సూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వం లో విశ్వంభర సినిమా చేస్తున్నారు . ఇక ఈ సినిమా విశేషాలు గురించి వస్తే ఇదొక ప్రత్యేక లోకాల తో ముడిపడిన కథ గా తెలుస్తోంది. కథ కూడా చాల బాగా కుదిరినట్లు సమాచారం.             ఈ సినిమా లో చాలా వరకు 70 శాతం VFX WORK వుంటుందట ,దాని కోసమే మూవీ టీం చాలా సమయం కేటాయించబోతున్నారు ,ఈ సినిమా లో మన మెగాస్టార్ చిరంజీవి చాల మంచి  getups లో కనిపించబోతున్నారట . ఈ న్యూస్ లు తెలిసినప్పటినుండి మెగాఫ్యాన్స్ చాల ఆనందంగా వున్నారు మరియు ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చాలా నమ్మకంగా వున్నారు .

ఈ మూవీ కి సంబందించిన కాన్సెప్ట్ టీజర్ ఈ సంక్రాంతి రోజు విడుదలై ఆడియన్స్ నుండి చాలా చాలా మంచి response తెచ్చుకుంది ,ఇక ఈ మూవీ వచ్చే సంక్రాంతికి అంటే 2025 సంక్రాంతి కి విడుదల అవుతుంది. ఈ మూవీ విషయంలో మెగాఫ్యాన్స్ అందరు దర్శకుడు వశిష్ఠ మీద చాల హోప్స్ పెట్టుకుని వున్నారు కారణం చిరంజీవి గారి లాస్ట్ మూవీ భోళాశంకర్ ప్లాప్ కాబట్టి , ఈ మూవీ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ తో చిరంజీవి గారు comeback అవ్వాలని కోరుకుంటున్నారు ,చూస్తుంటే ఫాన్స్ కోరిక వచ్చే సంక్రాంతికి తీరేలా వుంది.

ఇక నిన్నటి రోజు ఈ సినిమా లో హీరోయిన్ గా త్రిష ని ఫిక్స్ చేసినట్లు , త్రిష షూటింగ్ లో జాయిన్ అయినట్లు వీడియో కూడా రిలీజ్ చేసారు యూవీ క్రియేషన్స్ వాళ్ళు . ఈ సినిమాకి సంగీతం ఎం ఎం కీరవాణి , యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ , ప్రమోద్ ప్రొడ్యూసర్ గ వున్నారు. ఈ సినిమా ను 2025 year సంక్రాంతి సందర్భం గా జనవరి 10 తేదీన రిలీజ్ అవుతోంది

Leave a Comment