శ్రీ యేసు నామం శక్తి గల నామం తెలుగు లిరిక్స్ – Sree Yesu Namam Song Lyrics
Sree Yesu Namam Lyrics | శ్రీ యేసు నామం శక్తి గల నామం | Sree Yesu Namam Song Lyrics | Sree Yesu Namam Song Lyrics In Telugu and English | Sree Yesu Namam
Sree Yesu Naamam Lyrics in Telugu
శ్రీ యేసు నామం శక్తి గల నామం పాపికి పుణ్య నామం (2)
1. ఎల్ల నామములకెల్ల మేలైన నామం యేసుని దివ్య నామం (2)
సర్వజనులెల్ల సర్వకాలమంతా హర్షముతో పాడు నామం (2) || శ్రీ యేసు ||
2. పాప పరిహారమిచ్చి పాపులను రక్షింప పుడమికేతెంచె నామం (2)
పాప రహిత జీవితం ప్రసాదించే నామం పరిశుద్ధ పుణ్య నామం (2) || శ్రీ యేసు ||
3. పాప గోడలన్నియు పడగొట్టునట్టి ప్రభు యేసు ప్రియ నామం (2)
దోషములు మోసములు నాశనమొనరించు నీతిగల యేసు నామం (2) || శ్రీ యేసు ||
4. పాపచింతలన్నీ పారద్రోలు నామం ప్రభు యేసు పుణ్య నామం (2)
నిత్య శాపం మాపి సత్యమార్గం జూపి నిత్య రాజ్యం చేర్చు నామం (2) || శ్రీ యేసు ||
5. వ్యాధి బాధలన్నియు భరించిన నామం స్వస్థపరచు యేసు నామం (2)
కష్టనష్టములో కాచి కాపాడెడు క్రీస్తు యేసు దివ్య నామం (2) || శ్రీ యేసు ||
6. శత్రు సైతానుని సంహరించినట్టి శక్తిగల యేసు నామం (2)
నిత్య జీవమిచ్చి సత్యవేదమిచ్చిన శ్రీయేసు ఘననామం (2) || శ్రీ యేసు ||
7. ఎంత ఘోర పాపంమైన ఎంత మొత్తమైనా క్షమియించును యేసు నామం (2)
పాప పరితముతో ప్రభు పాదం చేరిన కాపు నిచ్చు కృప నామం (2) || శ్రీ యేసు ||
Read More Telugu Christian Song Lyrics
Sree Yesu Naamam Song YouTube Video
Sree Yesu Namam Lyrics In Telugu| Sree Yesu Namam Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu