రజినీకాంత్ – యాభై 50 ఏళ్ళ కెరీర్ లో లాల్ సలాం మరక…

Rajinikanth Faces Career Worst Collections For Lal Salaam

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ లాల్ సలాం ఈ ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యింది .ఈ సినిమా రిలీజయిన మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది . కథ కొత్తగా లేకపోవడం , డైరెక్టర్ అయినా రజిని కూతురు ఐశ్వర్య సినిమా ని సరిగా టేకప్ చేయకపోవడం జరిగింది . ఈ సినిమా పైన హైప్ ముందు నుంచి పెద్దగా లేదు ,ఎందుకో తమిళ జనాలు కూడా ఈ సినిమా పై ఇంటరెస్ట్ చూపలేదు ,ప్రమోషన్స్ కూడా సరిగా చేయలేదు అందువల్ల ఫస్ట్ డే మన తెలుగు బాక్సాఫీస్ దగ్గర చాలా షోలు కాన్సల్ తో డే ఎండ్ నెగిటివ్ షేర్ తో ఎండ్ అయ్యింది.

rajinikanth faces career worst collections

తమిళ్ లో కూడా 5కోట్ల నుండి 8కోట్ల లోపు గ్రాస్ వచ్చింది , ఇది సూపర్ స్టార్ ఫాన్స్ కు చాలా చాలా భాదను కలిగించింది ,రజినీకాంత్ లాస్ట్ ఫిలిం జైలర్ అల్ టైం సెన్సషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దూలపగా ,జైలర్ తరువాత చిత్రం లాల్ సలాం ఈ విధమైన result తెచ్చుకోవడం చాలా బాధాకరం. ఇక ఈ సినిమా తెలుగు లో ఘోరంగా నైజాం మరియు ఆంధ్ర కలిపి 6 రోజు ల కలెక్షన్స్ 1.50 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్  చేసినట్లు వెబ్ మీడియా లో సర్క్యూలేట్ అవుతోంది . ఇది సూపర్ స్టార్ రేంజ్ కి చాలా ఘోరమనే చెప్పాలి ,ఎందుకంటే రజినీకాంత్ లాస్ట్ సినిమా జైలర్ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది . జైలర్ కి చిరంజీవి భోళా శంకర్ చిత్రం ప్లాప్ అవడం కలిసొచ్చింది .రజినీకాంత్ పాత చిత్రాలను రీ రిలీజ్ చేసిన కూడా ఈ లాల్ సలాం మూవీ కలక్షన్స్ కంటే ఎక్కువ వస్తాయని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.

రజినీకాంత్ ఫాన్స్ తొందరగా ఈ సినిమాను మరిచి, నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ తో తీయబోయే సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు .లోకేష్ కనగరాజ్ తనదైన స్టోరీ నరేషన్ తో సూపర్ స్టార్ కి కమల్ హాసన్ విక్రమ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చినట్లు రజినీకాంత్ కి కూడా సూపర్ హిట్ ఇస్తాడేమో చూడాలి .

 

Leave a Comment