దేవ సంస్తుతి చేయవే మనసా | Deva Samsthuthi Cheyave Manasa Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

దేవ సంస్తుతి చేయవే మనసా తెలుగు లిరిక్స్ – Deva Samsthuthi Cheyave Manasa Song Lyrics

Deva Samsthuthi Cheyave Manasa Lyrics | దేవ సంస్తుతి చేయవే మనసా | Deva Samsthuthi Cheyave Manasa Song Lyrics | Deva Samsthuthi Cheyave Manasa Song Lyrics In Telugu and English | Deva Samsthuthi Cheyave Manasa

Deva Samsthuthi Cheyave Manasa Lyrics in Telugu

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా నా యంతరంగము
లో వసించు నో సమస్తమా || దేవ సంస్తుతి ||

1. జీవమా యెహోవా నీకు జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

3. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

4. ప్రభువు నీతి పనులు చేయును బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

5. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

6. పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

7. పడమటికి తూర్పెన్త ఎడమో పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

8. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

9. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

10. పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే || దేవ సంస్తుతి ||

Read More Telugu Christian Song Lyrics

Deva Samsthuthi Cheyave Manasa Lyrics in English

Deva Samsthuthi Cheyave Manasa
Sree manthudagu Yehova Samsthuthi Cheyave Manasaa
Deva Samsthuthi Cheyumaa Naa Jeevama Yehovaa Devuni
Paavana Namaamu Nuthinchumaa Naa Yantharangamu
lo Vasinchu No Samasthamaa || Deva Samsthuthi ||

1. Jeevamaa Yehovaa Neeku Jesina Mellan Maruvaku (2)
Neevu Chesina Paathakambulanu Manninchi Jabbu
Leviyun Lekunda Jeyunu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

2. Chaavu Gothinundi Ninnu Levanetthi Dhayanu Grupanu (2)
Jeeva Kireetamuga Veyunu Nee Sirasu Meedha
Jeeva Kireetamuga Veyunu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

3. Yavanambu Pakshiraaju Yavanambu Valene Krottha (2)
Yavanambai Velayunatlugaa Me Lichchi Needhu
Bhaavamunu Santhushti parachunugaa Aa Kaaranamuche || Deva Samsthuthi ||

4. Prabhuvu Neethi Panulu Cheyun Baadhithulaku Nyaaya Michchun (2)
Vibhundu Maargamu Thelipe Mosheku Dhana Kaaryamulanu
Vippe Nisraayelu Janamunaku Aa Kaaranamuche || Deva Samsthuthi ||

5. Athyadhika Prema SwaroopiYaina Deergha Saanthaparundu (2)
Nithyamu Vyaajyambu Cheyadu Aa Kruponnathudu
Nee Payi Nepudu Kopa Munchadu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

6. Paamarula Mani Prathyupakaara Prathi Phalambul Pampaledu (2)
Bhoomi Kanna Naakasambunna Yetthundu Daiva
Prema Bhakthi Janulayanduna Aa Kaaranamuche || Deva Samsthuthi ||

7. Padamatiki Thoorpentha Yedamo Paapamulakunu Manaku Nantha (2)
Yedamu Kalugajesiyunnaadu Mana Paapamulanu
Edamugaane Chesiyunnaadu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

8. Kodukulapai Thandri Jaali Padu Vidhamugaa Bhakthiparula (2)
Yedala Jaali Padunu Dhevundu Thana Bhakthiparula
Yedala Jaalipadunu Dhevundu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

9. Manamu Nirmithamayina Reethi Thanaku Dhelisiyunna Sangathi (2)
Manamu Manti Vaaramanchunu Gnaapakamu Chesi
Konuchu Karuna Joopuchundunu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

10. Poosi Gaali Veeva Negiri Poyi Basanu Deliyani Vana (2)
Vaasa Pushpamu Valene Narudundu Naru Naayuvu Thruna
Praayamu Mana Deva Krupa Mendu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

11. Parama Deva Nibandha Naagnal Bhakthitho Gaikonu Janulaku (2)
Nirathamunu Grupa Nilichi Yundunu Yehova Neethi
Tharamulu Pillalaku Nundunu Aa Kaaranamuche || Deva Samsthuthi ||

Deva Samsthuthi Cheyave Manasa Song YouTube Video

Deva Samsthuthi Cheyave Manasa Lyrics In Telugu| Deva Samsthuthi Cheyave Manasa Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | Deva Samsthuthi Cheyave Manasa Lyrics In Telugu and English | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment