చిరంజీవి విశ్వంభర : బిగ్ యాక్షన్ సీక్వెన్స్ కి రెడీ

Chiranjeevi Ready to Big Action Sequence For Viswambhara

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర గురించి ఏ అప్డేట్ అయినా మెగా ఫాన్స్ ని ఖుషి చేస్తోంది  ఎందుకంటే ఫాన్స్ కి ఈ సినిమా అంత హోప్స్ వున్నాయి ,కారణం మెగాస్టార్ చాలా సంవత్సరాల తరువాత జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ మీద సినిమా చేయడం, అందులో మెగాస్టార్ getups అన్ని చాల డిఫరెంట్ గ ఉంటాయి అని తెలియడంతో ఫాన్స్ మస్త్ ఖుషి గ వున్నారు .

Chiranjeevi Ready to Big Action Sequence

ఇక ఈ మూవీ లేటెస్ట్ గ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. చిరంజీవి గారు కొంత విరామం తీసుకున్న తరువాత మళ్ళి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారట . ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిరంజీవి గారు మరికొంత మంది ఫైటర్స్ మీద షూట్ చేయబోతున్నారట ,దీనికోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ కూడా రెడీ చేస్తున్నారట ఈ సినిమా మేకర్స్. ఇదే మెగాఫ్యాన్స్ కి ఆనందంగా వుంది . ఎందుకంటే ఫాన్స్ చిరంజీవి గారు నుండి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద నమ్మకంతో వున్నారు .

విశ్వంభర మూవీ కాన్సెప్ట్ టీజర్ 2024 సంక్రాంతికి వచ్చి అందరినుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది, ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా త్రిష ని సెలెక్ట్ చేసారు మేకర్స్ ,ఇంకొక హీరోయిన్ కూడా ఉంటారని సమాచారం . ఈ మూవీ డైరెక్టర్ బింబిసార ఫేమ్ వశిష్ట ,యూవీ క్రియేషన్స్ మీద నిర్మాతలు వంశి మరియు ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ,సంగీతం ఎం ఎం కీరవాణి గారు . ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ అవుతుంది.

Leave a Comment