Thaman busy busy in 2024
సంగీత దర్శకుడు థమన్ గురించి , అతను కంపోజ్ చేసే మ్యూజిక్ ఆ మ్యూజిక్ చేసే మ్యాజిక్ మనకు తెలుసు . ఈ సంవత్సరం సంక్రాంతికి థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా వచ్చింది. కాకపోతే ఈ మూవీ మ్యూజిక్ పరంగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది ,సూపర్ స్టార్ ఫాన్స్ అందరు అల వైకుంఠపురంలో సినిమా కు మించి మ్యూజిక్ థమన్ ఇస్తాడని అనుకున్నారు ,కానీ ఈ సినిమా లో ఒక్క మసాలా పాట అయినా కుర్చీ మడతపెట్టి సాంగ్ తప్ప మిగతావన్నీ సోసో రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంత గొప్పగా లేదు ,ఈ విషయంలో థమన్ చాలా విమర్శలు ,భారీ ట్రోల్స్ ని ఎదుర్కొన్నాడు.
ఇదంతా పక్కన పెడితే థమన్ ఈ 2024 సంవత్సరం చాల చాల బిజీ గ ఉండపోతున్నాడు పాన్ ఇండియా సినిమాలతో ,అవి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్త్తున్న భారీ సినిమా OG ,ఈ మూవీ 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది ,ఇంకొక సినిమా తమిళ తేరి కి రీమేక్ గా హిందీలో వస్తున్న బేబీ జాన్ కు ,ఇంకా షూటింగ్ పోస్టుపోన్ అవుతూ వస్తున్నా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ,డైరెక్టర్ శంకర్ ల గేమ్ చేంజెర్ ,రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు మారుతీ దర్శకత్వం లో వున్న రాజాసాబ్ మూవీస్ థమన్ ఖాతా లో వున్నాయి .
ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు వీటిలో కొన్నింటికి ఆల్రెడీ థమన్ వర్క్ మొదలు పెట్టాడు. చూడాలి ఈ సినిమాలు అన్నింటికీ థమన్ మ్యూజిక్ ఎలా ఇస్తాడో ,సరిగా లేకపోతే మళ్ళీ విమర్శలు అన్ని థమన్ ని చుట్టుముడతాయి .ఏమైనా థమన్ ఈ 2024 సంవత్సరం చాల చాల బిజీ గ ఉండపోతున్నాడు.